బాలీవుడ్‌లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన తాజా చిత్రం వార్ 2. హృతిక్ రోషన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ముందే పెరిగిపోయింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి దుమ్ము రేపుతోంది.
హిందీతో పాటు తెలుగు వెర్షన్‌లో కూడా ఈ సినిమా బలమైన ఫలితాలు సాధిస్తోంది. వర్కింగ్ డేలో రిలీజ్ అయినప్పటికీ, తరువాత రోజు స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా కలెక్షన్లు మరింతగా పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లోనే 55 శాతం వరకు వసూళ్లు పెరిగాయనేది టాక్.
రెండో రోజు మాత్రమే ఈ సినిమా 45 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టిందని సమాచారం. మొత్తం మీద చూసుకుంటే రివ్యూలు ఎలా ఉన్నా, వర్డ్ ఆఫ్ మౌత్ ఎలాగైనా, వార్ 2 బాక్సాఫీస్ వద్ద మాత్రం హవా చూపిస్తోంది. ఈ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం వహించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం అందించారు.
