వార్‌ 2 నుంచి ఊపిరి ఊయలాగా..వచ్చేసింది!

Friday, December 5, 2025

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “వార్ 2” నుంచి మొదటి పాట విడుదలైంది. ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే సినిమాపై బజ్ భారీగా ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ సాంగ్ తో ఆ క్రేజ్ మరింత పెరిగేలా చేసింది.

ఈ పాటను నేడు హీరోయిన్ కియారా అద్వాణీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ట్రీట్‌గా విడుదల చేశారు. హృతిక్, కియారా జోడీ స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్ గా, అట్రాక్టివ్ గా కనిపించారు. పాటలోని మెలోడీ ట్యూన్స్ శ్రోతల్ని మెప్పించేలా ఉండగా, విజువల్స్ కూడా పక్కా గ్రాండ్‌గా రూపొందించారు.

ఇంకా చెప్పాలంటే, ఈ సాంగ్‌లో కియారా గ్లామర్ ప్రెజెన్స్ ఓ రేంజ్‌లో ఉంది. గతంలో విడుదలైన టీజర్‌లో ఆమె ఆకట్టుకున్న విధానం ఇక్కడ కూడా కొనసాగింది. స్పష్టంగా ఆమె పాత్ర సినిమాలో కీలకమైందని, అలానే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటుందని ఈ పాట చూసినవాళ్లకు అర్థమవుతుంది.

సామాన్యంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాటను మేకర్స్ సరైన టైమింగ్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట “వార్ 2”పై ఆసక్తిని మరింత పెంచుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles