సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కూలీ ఇప్పుడు ప్రేక్షకులలో మంచి ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా స్పెషల్గా ఉండటంతో, కూలీ పై అంచనాలు మరో లెవెల్లో ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఈసారి ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇంతవరకూ లోకేష్ సినిమాలకు ప్రమోషన్స్ ఎక్కువగా ఇంటర్వ్యూలతోనే జరిగేవి. కానీ ఈసారి మాత్రం కూలీ కోసం మరో రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు అమెజాన్ డెలివరీ ప్యాకేజింగ్ పై కనిపించడం చాలా మందిని ఆకట్టుకుంది. డెలివరీ బాక్సుల మీద సినిమా పోస్టర్లు ఉండటం ఓ కొత్త విధానం కావడంతో నెటిజన్లు ఈ యూనిక్ ఐడియాను గమనించి చర్చించుకుంటున్నారు.
ఇలా బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ పూర్తిగా క్రియేటివిటీ చూపిస్తున్నారు. అంతే కాకుండా, దీనికి సంబంధించి ఓ స్పెషల్ ప్రోమో వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోతో ప్రమోషన్ స్టైల్ ఎలా ఉండబోతుందో స్పష్టమవుతోంది.
ఇక భారీ అంచనాల నడుమ వస్తున్న కూలీ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
