వార్ 2’కి ఇండియా లోనే ఫస్ట్ ఎవర్ విడుదల!

Friday, December 5, 2025

బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్‌లో మాస్ అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మాస్త్ర వంటి విజువల్ వండర్ సినిమాను తీసిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఆసక్తి మరింతగా పెరిగింది.

ఈ సినిమాతో ఇండియన్ స్క్రీన్లపై ఓ సరికొత్త ఫీలింగ్ ఇవ్వనున్నారని సమాచారం. డాల్బీ సినిమా టెక్నాలజీలో ఇండియాలో విడుదలయ్యే మొట్టమొదటి చిత్రం వార్ 2 కావడం విశేషం. ఈ టెక్నాలజీ వల్ల ప్రేక్షకులకు థియేటర్లలో చాలా రిచ్ అనుభవం దొరకనుందని చిత్రబృందం చెబుతోంది.

ఇకపోతే, సంగీత దర్శకుడు ప్రీతమ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో లెవల్ ఎఫెక్ట్ ఇచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార వీడియోలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక డాల్బీ సినిమాతో వస్తోందన్న విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles