విజయ్ దేవరకొండ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “కింగ్డమ్” ప్రేక్షకుల ముందుకు వచ్చే వారం రాబోతుంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ వేళ దూకుడు మీదుంది. ప్రమోషన్ల జోరును మేకర్స్ మరింత పెంచారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర ఇంటర్వ్యూ కోసం ఏర్పాట్లు జరిగాయి. హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. ఈ స్పెషల్ ఇంటరాక్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఈ ఇంటర్వ్యూతో కింగ్డమ్ బృందం మరోసారి హైప్ పెంచేలా చూస్తోంది. అభిమానుల్లో ఉత్సాహం పెంచేలా ఈ కంటెంట్ ఉండబోతోందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ వీడియో కూడా రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.
