సన్నీ లియోన్ నటిస్తున్న తాజా సినిమా త్రిముఖ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారుతోంది. అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, సన్నీ లియోన్, ఆశు రెడ్డి, షకలక శంకర్ వంటి నటీనటులు ఈ సినిమాకు ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇటీవల త్రిముఖ చిత్రంలో ఒక ప్రత్యేక పాట షూటింగ్ పూర్తయింది. “గిప్పా గిప్పా” అనే ఈ ఐటెం సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో సన్నీ లియోన్ సహా పొలిమేర ఫేమ్ సాహితీ దాసరి, ఆకృతి అగర్వాల్ లాంటి నటి లు ఆకట్టుకునే డాన్స్ నెంబర్‌తో కనిపించనున్నారు. ఇందులో పది మందికి పైగా సినీ ప్రముఖులు కూడా స్టెప్పులు వేశారు. దాంతో ఈ పాట సినిమాకు స్పెషల్ హైలైట్‌గా నిలిచే అవకాశముంది.
ఇప్పటికే ఈ సాంగ్ విజువల్స్, కాస్ట్యూమ్స్, కొరియోగ్రఫీ తదితర అంశాలపై మంచి బజ్ ఏర్పడింది. భారీ బడ్జెట్‌తో చిత్రీకరించిన ఈ పాటను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన అధికారిక విడుదల తేదీని కూడా ఈ నెలాఖరులో ప్రకటించనున్నట్టు సమాచారం.
సన్నీ లియోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. బోల్డ్ కంటెంట్‌తో కాకుండా, వాణిజ్య అంశాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్‌గా నిలవాలన్న నమ్మకంతో రూపొందిస్తున్నారు.
