అప్పుడు ఆదిపురుష్‌ గురించి కూడా అలానే ..!

Friday, December 5, 2025

బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమాల్లో ముందున్నది రామాయణ. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ వంటి టాప్ స్టార్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన టెక్నికల్ విలువలతో తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వానరసేన ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్‌లోని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ టెక్నిక్ వలన గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్‌గా ఉండబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి.

అయితే ఇదే తరహా మాటలు గతంలో ఆదిపురుష్ సినిమా సమయంలో కూడా వినిపించాయి. ఆ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో అవతార్ స్థాయిలో చేస్తామని అప్పట్లో మేకర్స్ చెప్పిన సంగతి గుర్తుంది. కానీ ఫలితం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా వానరసేన విజువల్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు రామాయణకు 4000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ స్థాయి ఖర్చుతో వచ్చే విజువల్స్ తప్పకుండా నేచురల్‌గా ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఆదిపురుష్ లాంటి తప్పిదాలు రిపీట్ కాకుండా ఈసారి నిజమైన ఎపిక్ అనుభూతి ఇవ్వగలరా అన్నది ఇప్పుడు అందరికి కుతూహలంగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles