టాలీవుడ్లో ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల ఇటీవల తెరకెక్కించిన చిత్రం “కుబేర” థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద అంచనాలను రేపింది.
రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో, కుబేర వసూళ్లు రూ.100 కోట్ల మార్క్‌ను దాటేయడం గమనార్హం. శేఖర్ కమ్ముల ప్రత్యేక మేకింగ్, నాగార్జున-ధనుష్ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా మారాయి.
ఇప్పుడీ సక్సెస్ఫుల్ మూవీ ఓటీటీలోకి చేరింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18 నుంచి కుబేర స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయినవారికి ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది.
