కియారా పాపకి ..పండంటి పాప పుట్టిందోచ్‌!

Friday, December 5, 2025

బాలీవుడ్‌లో ఫేమస్ జంటలలో ఒకరైన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023లో వివాహం చేసుకొని ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నారు. అందం, టాలెంట్ రెండింటినీ కలగలిపిన కియారా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ మంచి హైప్‌తో ఉండటం విశేషం. తాజాగా ఆమె తల్లి అయ్యిందన్న వార్తపై బాలీవుడ్ వర్గాల్లో మంచి చర్చ నడుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిసింది. తమ ఇంట్లోకి చిన్నారి అడుగుపెట్టిన సంతోషంలో ఉన్నారని, కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయిందని ఆమెకు దగ్గరవారంతా చెబుతున్నారు.

ఈ లవ్లీ కపుల్‌ తల్లిదండ్రులుగా మారిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో విషెస్‌తో పోటెత్తుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు కూడా తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక బాలీవుడ్‌లో మరో స్టార్ బేబీ జన్మించిందన్న వార్త అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది.

కియారా – సిద్ధార్థ్ లయమైన జీవితంలో ఇది ఒక సరికొత్త అధ్యయం అంటూ, వారి కొత్త రోల్స్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా మారిన సందర్భంలో సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా వారికి తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles