తారక్‌-త్రివిక్రమ్‌ మూవీ నాగవంశీ క్లారిటీ!

Friday, December 5, 2025

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన “వార్ 2” మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చేసింది. ఇక తర్వాతి సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడుతున్నాడు తారక్.

ఇవన్నీ జరుగుతుండగానే ఎన్టీఆర్ అభిమానులకు మరో మంచి వార్త బయటకు వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమా గురించి నిర్మాత నాగవంశీ తాజాగా కీలక విషయాలను బయటపెట్టాడు. త్రివిక్రమ్ నెక్స్ట్  ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్‌తోనే అని, ఆ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని చెప్పారు. ఆ సినిమా 2026 మొదటి అరవ భాగంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

అలాగే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రానున్న సినిమాలో ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రం ఇప్పటివే స్టార్ట్ అయిపోయాయని చెప్పారు. వచ్చే ఏడాది రెండవ అర్ధభాగంలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పెషల్ వీడియో విడుదల చేయాలనుకున్నట్టు చెప్పారు కానీ ఇటీవలే “రామాయణ” సినిమాలో చూపించిన విజువల్స్ చూసిన తర్వాత, తాము తీయబోయే వీడియో అంతకన్నా గ్రాండ్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యారట. అందుకే సమయం తీసుకొని ప్రోమోను హై స్టాండర్డ్స్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

మొత్తానికి త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మళ్లీ వర్క్ చేయడానికి సిద్ధమవుతోందనేది ఖరారు. ఈసారి మాత్రం అన్ని హంగులతో, జాగ్రత్తగా ప్లాన్‌ చేసి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ప్లానింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles