టాలీవుడ్‌లో మరో క్రేజీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ‘జూనియర్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో కిరీటి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
హీరోయిన్‌గా శ్రీలీల నటించడంతో మొదట నుంచే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై మంచి హైప్ తెచ్చేశాయి. ట్రైలర్ చూసినవాళ్లంతా సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా ఉందని చెప్పుకుంటున్నారు.
శ్రీలీల ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమాచారం ప్రకారం ఆమె రూ.2.5 కోట్ల వరకూ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమెకు తెలుగులో పెరిగిన క్రేజ్, డిమాండ్ కారణంగానే ఇలా భారీగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో జెనీలియా కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. చాలా కాలం తర్వాత ఆమె ఓ తెలుగు సినిమాలో నటిస్తుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది దేవిశ్రీ ప్రసాద్. సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.
సర్వం సిద్ధమైన నేపథ్యంలో, జూలై 18న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కొత్త హీరో ఎంట్రీ, టాలెంటెడ్ హీరోయిన్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్, సీనియర్ నటీమణి ఉండటంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశాలున్నాయి.
