స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తన కెరీర్‌లో వరుసగా కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. కొన్నిసార్లు ఆమె ఎంచుకునే పాత్రలు మంచి ఫలితాల్ని ఇస్తే, మరికొన్ని మాత్రం ఆశించిన స్థాయిలో ఫలించకపోతున్నాయి. అయినా ఆమె తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. అయితే సినిమాలకంటే ఎక్కువగా శ్రుతి సోషల్ మీడియాలో ఉండే ఆక్టివ్‌నెస్ వల్లే చాలామంది ఆమెకు ఫాలోవర్స్ అయ్యారు. ఆమె షేర్ చేసే ఫోటోలు, పోస్టులు విపరీతమైన చర్చలకు కారణమవుతూ ఉంటాయి.
అలాంటి శ్రుతి హాసన్ ఇప్పుడు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కొంతకాలం పాటు ఆన్‌లైన్ నుంచి విరామం తీసుకుంటున్నట్లు తెలిపింది. హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం ఆమె ఫ్యాన్స్‌ను కాస్త కంగారుపడేలా చేసింది. ఆమె హాట్ లుక్ పోస్టులు, ఆసక్తికర వీడియోలు రెగ్యులర్‌గా చూస్తున్న అభిమానులకు ఇది ఊహించని పరిణామం అయ్యింది. ప్రస్తుతం తాను తన జీవితంలో కొంత ప్రశాంతత కోరుకుంటున్నట్లు అర్థమయ్యేలా ఆమె పోస్ట్‌లో పేర్కొంది.
ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, రజినీకాంత్‌తో కలిసి ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘కూలీ’ త్వరలో విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
