గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటం వల్లే కాక, చరణ్ మాస్ అవతారంలో కనిపించనున్నారని తెలిసి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో సాగుతోంది.
ఇప్పటికే పలు కీలక దృశ్యాలు చిత్రీకరణ పూర్తవ్వగా, వచ్చే షెడ్యూల్‌ను మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ చివరలో లేదా నవంబర్ మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగించేందుకు దర్శకుడు బుచ్చిబాబు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నాడు. మరోవైపు, సినిమాలో చూపించనున్న క్లైమాక్స్ స్పోర్ట్స్ మ్యాచ్ కోసం ఢిల్లీ స్టేడియాన్ని సెలెక్ట్ చేసినట్టు టాక్. అక్కడే ఈ ఫైనల్ ఎపిసోడ్‌ను భారీగా చిత్రీకరించబోతున్నారట.
ఇప్పటివరకూ వచ్చిన అప్డేట్స్ చూస్తే, ఈ క్లైమాక్స్ మ్యాచ్ సీన్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, అలాగే టాలీవుడ్ నటుడు జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ పని చేస్తున్నారని తెలిసి సంగీతానికి కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
మొత్తంగా చెప్పాలంటే, రామ్ చరణ్ సినిమా కావడం, బుచ్చిబాబు డైరెక్షన్ ఉండడం, మ్యూజిక్ రెహమాన్ ఇవ్వడం.. ఇవన్నీ కలిపి ‘పెద్ది’ అనే సినిమా మీద ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.
