తెలుగులోకి నరివెట్ట!

Thursday, December 11, 2025

మలయాళ హీర టొవినో థామస్ యాక్ట్‌ చేసిన తాజా కాప్ యాక్షన్ డ్రామా మూవీ ‘నరివెట్ట’.  మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘నరివెట్ట’ను తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వేసవి కానుకగా మే 23న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ వారు గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా వారు ప్రకటించారు. ఇటీవల ‘ఐడెంటిటీ’ మూవీలో టొవినో తన పాత్రతో ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇలా పోలీస్ స్టోరీ చిత్రంతో వస్తుండటంతో ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అవుతుంది.

ఇక ఈ సినిమాను అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేస్తుండగా అబిన్ జోసెఫ్ నిర్మించారు. ఈ సినిమాలో సురాజ్ వెంజరమూడు, చెరణ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles