శ్రీవిష్ణు హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద మంచి ఊపు మీద దూసుకెళ్తోంది. విడుదలైన ప్రతి రోజు సత్తా చాటుతూ మంచి వసూళ్లు రాబడుతోంది. మూడు రోజులకే చక్కటి కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా, వారం ప్రారంభంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 16.3 కోట్ల వసూళ్లను సంపాదించింది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే రూ. 5.1 కోట్లు వచ్చాయి.
బుక్‌మైషోలో గత 24 గంటల్లో 66,000 టికెట్లు అమ్ముడవ్వగా, మొత్తం టిక్కెట్ల సంఖ్య 2 లక్షల మార్కును దాటింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి దానివల్ల స్పష్టంగా తెలుస్తోంది.కేవలం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఈ సినిమా మంచి స్పందన పొందుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 400 వేల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. త్వరలోనే హాఫ్ మిలియన్ మార్క్ అందుకోనుందని చిత్ర బృందం ఆశిస్తోంది.
కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించగా, సంగీతం విషయంలో విశాల్ చంద్రశేఖర్ తన ప్రతిభను చాటాడు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి ఈ సినిమాను నిర్మించారు.
