నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రంపై రామ్‌చరణ్ ప్రశంసలు కురిపించారు. ఇంతకీ, చరణ్ ఏం కామెంట్స్ చేశారంటే.. ‘హిట్ 3’ గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నాను. వినూత్నమైన స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ విభిన్న జానర్స్‌లో బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్న మై డియర్ బ్రదర్ నానికి కంగ్రాట్స్. ఇలాంటి ఇంటెన్స్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శైలేశ్ కొలనుకు హ్యాట్సాఫ్’ అంటూ చరణ్ పోస్ట్ చేయడం విశేషం.
చరణ్ తన పోస్ట్ లో ‘శ్రీనిధి శెట్టితోపాటు ఇతర చిత్రబృందానికి, నిర్మాతలకు అభినందనలు’’ అంటూ రాసుకొచ్చారు. మే 1న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
