రాజమౌళి అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా?

Andhrawatch
1 Min Read
Indian filmmaker S. S. Rajamouli arrives for the BAFTA Tea Party at the Four Seasons Hotel in Los Angeles, California, on January 14, 2023. (Photo by Michael Tran / AFP)

ప్రముఖ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఏ విధంగా ఇండియా రిచ్‌ ?’ అని అడిగినప్పుడు.. కథల విషయంలో అని చెప్పానని తెలిపారు. మహాభారతం, రామాయణంలాంటి ఇతిహాసాలు మన ఆస్తులని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు.

అలాగే, ‘బజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌, ఆమిర్‌ ఖాన్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు గురించి విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తావించారు.ఇంతకీ, విజయేంద్ర ప్రసాద్‌ ఏం కామెంట్స్ చేశారంటే.ఏం అన్నారంటే… ‘కొంతకాలం క్రితం సల్మాన్‌ఖాన్‌ను కలిశాను. ‘బజరంగీ భాయిజాన్‌’ కొనసాగింపునకు సంబంధించి ఓ పాయింట్‌ చెప్పాను. అది ఆయనకు చాలా బాగా నచ్చింది.

మరి ఏం జరుగుతుందో చూద్దాం. ‘మహాభారతం’ ప్రాజెక్టు కోసం ఆమిర్‌ నన్ను ఓసారి కలిశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు’ అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఇక రాజమౌళి అంతిమ లక్ష్యం ‘మహాభారతం’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు.

Share This Article