కోలీవుడ్ బిగ్ స్టార్స్ తో థలా అజిత్ కూడా ఒకరు. మరి అజిత్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం “విడా ముయర్చి” అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఈ చిత్రం చాలా లేట్ అవుతూ వస్తుండడం హైప్ కూడా అలానే తగ్గిపోయింది. కనీసం అనిరుద్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ కాలేకపోయింది. కానీ ఫైనల్ గా ఇపుడు అజిత్ నుంచి ఫుల్ మీల్స్ మాత్రం మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో చేస్తున్న సాలిడ్ చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ”తో రాబోతుంది అని చెప్పవచ్చు.
ఈ చిత్రాన్ని అజిత్ ఫ్యాన్ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తుండగా అనౌన్స్ చేసిన నాటి నుంచే ఈ సినిమాపై ఆడియెన్స్ లో మంచి హైప్ ఉంది. ఇక మేకర్స్ నేడు అవైటెడ్ టీజర్ ని దింపబోతుండగా తమిళ్ ఆడియెన్స్ సహా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా ఈ టీజర్ పట్ల మంచి ఆసక్తి కనిపిస్తుంది.
