చిరు-రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా! టాలీవుడ్‌లో హిట్ మెషిన్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన నుంచి వచ్చిన రీసెంట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించడంతో వారిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.
ఇక ఇప్పుడు అందరి చూపు అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై పడింది. ఇప్పటికే తన నెక్స్ట్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించాడు. ఇక ఈ సినిమా కూడా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుందని ఆయన చెబుతున్నాడు. అయితే, ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నట్లు అనిల్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
కాగా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్‌ను ఆయన ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ‘రౌడీ అల్లుడు’ లాంటి వింటేజ్ చిరంజీవిని మనకు చూపించబోతున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్. మరి నిజంగానే చిరంజీవి కోసం ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి ఫిక్స్ చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది.