మహేష్ లగ్జరీ ట్రీట్! టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో పాన్ వరల్డ్ లెవెల్ సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ప్రపంచమే ఎదురు చూస్తుండగా మహేష్ బాబు నుంచి ఇప్పుడో క్రేజీ న్యూస్ తాజాగా బయటకి వచ్చింది.
మహేష్ కి హైదరాబాద్ లో తన ఏఎంబి మాల్ అండ్ థియేటర్స్ ఉన్నవిషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో ఇపుడు ఆడియెన్స్ కోసం ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించేందుకు రడీ అవుతున్నారు. హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా కంప్లీట్ రాయల్ గా లగ్జరీతో స్పెషల్ స్క్రీన్స్ తో న థియేటర్స్ ని “MB LUXE” గా తన మాల్ లో నిర్మించారని ప్రకటించారు. దీంతో ఈ విజువల్స్ చూసి అంతా ఓ రేంజ్ లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు