దటీజ్ బాలయ్య బాబు..అంటున్న మెగా ఫ్యాన్ డైరెక్టర్! తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన టాలీవుడ్ సినిమాల్లో డైరెక్టర్ కొల్లి బాబీ అలాగే నటసింహం బాలకృష్ణ కాంబోలో వచ్చిన భారీ హిట్ సినిమా ” “డాకు మహరాజ్” కూడా ఓ మూవీ. సాలిడ్ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచి అదరగొట్టింది.
అయితే ఈ సినిమా తాలూకా సక్సెస్ మీట్ ని మేకర్స్ నిన్న అనంతపురంలో గ్రాండ్ గా చేయగా అక్కడ దర్శకుడు బాబీ కామెంట్స్ బాలయ్య పై మరింత గౌరవాన్ని తీసుకు వచ్చాయని చెప్పుకోవాలి. తను బాలయ్య గారిని కలిసిన మొదటిరోజే తన కోసం అడిగితే నేను ఇలా చిరంజీవి గారి అభిమానిని అని ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పినపుడు బాలకృష్ణ గారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఎంకరేజ్ చేసారని తెలిపారు.
వేరే ఏ హీరో దగ్గరైనా ఇలా జరిగిందో లేదో నాకు తెలీదు కానీ బాలయ్య వ్యక్తిత్వం చాలా గొప్పది అని ఈ విషయం ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదని బాబీ తెలిపారు. దీంతో ఈ కామెంట్లు అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానుల్లో కూడా వైరల్ గా మారాయి.