దేవర విలన్‌ పై దాడి..కండిషన్‌ ఎలా ఉందంటే..!

Thursday, January 16, 2025

తాజాగా టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ హిట్‌ సినిమాల్లో   మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన సినిమా “దేవర” కూడా ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా తోనే హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా విలన్ గా నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సినిమాతో పరిచయం అయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సైఫ్ పై ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.తను నిజంగా రెండు కత్తి పోట్లకి గురయ్యారు అనే షాకింగ్ న్యూస్ ఇపుడు సినీ వర్గాలను వణికిస్తుంది. అయితే ఈ గురువారం ఉదయం 2 గంటల 30 నిమిషాల సమయంలో తను ముంబై లోనే తన ఇంట్లో ఉండగానే ఈ దాడికి లోనయినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఎవరో తన ఇంట్లోకి దొంగతనం చేసేందుకు చొరబడగా సైఫ్ అడ్డుకునే యత్నంలో అతడు తనపై హత్యాయత్నం చేసినట్టు బాలీవుడ్ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో తనని మూడున్నర సమయంలో అలా కుటుంబీకులు లీలావత్ హాస్పిటల్ కి తరలించారట. ప్రస్తుతం ఈ కేసు విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారట. అయితే ప్రస్తుతం సైఫ్ ప్రాణాలకు హాని లేదని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles