మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ‘లైలా’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో మెరవబోతున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఇక ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
లైలా మూవీ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. దీంతో ఈ టీజర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే అనౌన్స్‌మెంట్‌ను సంక్రాంతి రోజున ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో విశ్వక్ నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా రామ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.