జిమ్‌లో గాయపడిన రష్మిక..!

Saturday, January 11, 2025
జిమ్‌లో గాయపడిన రష్మిక..! నేషనల్ క్రష్ రష్మిక కు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె యాక్ట్ చేసిన మూవీస్ నార్త్, సౌత్ తేడా లేకుండా బ్లాక్‌ బస్టర్ విజయాలను అందుకుంటుండటంతో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇక ఆమె ప్రస్తుతం తన కొత్త సినిమాలపై తన ఫుల్‌ ఫోకస్ పెట్టింది. అయితే, తాజాగా ఆమెకు గాయం అయ్యిందని.. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాల్సిందిగా చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న రష్మిక కు గాయం అయ్యిందని.. దీని కారణంగా డాక్టర్లు ఆమెను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పినట్లు సమాచారం.

దీంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు వాయిదా పడనున్నట్లు తెలుస్తున్నాయి. అయితే, ఆమెకు గాయం అయ్యిందని తెలుసుకున్న అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles