తమిళ హీరో సూర్య తాజాగా ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు సూర్య తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో సూర్య తన 44వ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ కంటే ముందే, సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని కూడా ప్రారంభించాడు.ఆర్‌జె బాలాజీ డైరెక్షన్‌లో సూర్య తన కెరీర్‌లోని 45వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ త్రిష కూడా చేరింది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.
సూర్య, త్రిష కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ చాలారోజుల తరువాత ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది.