నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమాలో తన అదిరిపోయే నటనతో యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపుతుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక చేసిన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఇప్పటికే ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఈ సినిమాలో చేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ గా మారాయి.
ఇలా అందరు ‘పుష్ప-2’ మేనియాలో ఉండగానే, తన నెక్స్ట్ మూవీ అప్డేట్‌ను పట్టుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
రష్మిక నటిస్తున్న తాజా సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాలోని రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాలో రష్మిక నటనకు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఆమెపై ప్రత్యేకమైన ప్రశంసలు కురిపించాడు.
ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనుందా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం ఇచ్చారు.