మల్లన్న సన్నిధిలో కొత్త జంట!

Wednesday, December 18, 2024

కింగ్‌ నాగార్జున తన కుమారుడు,యువ సామ్రాట్‌ నాగచైతన్య ,కోడలు శోభిత తో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జంట స్వామివారికి  రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు.తొలుత ఆలయ మహాద్వారం వద్ద వారికి ఆలయ అధికారులు ,అర్చకులు స్వాగతం పలికారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌  అవుతున్నాయి. ఇదిలా ఉంటే చైతూ-శోభిత పెళ్లి ఫొటోలను తాజాగా నాగార్జున తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా డియర్‌ ఫ్రెండ్స్‌,ఫ్యామిలీ, అభిమానులు…మీ ప్రేమ ,ఆశీస్సులు ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేశాయి. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఙతతో నా హృదయం ఉప్పొంగుతోంది అంటూ రాసుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles