యంగ్‌ ఎన్టీఆర్‌ కి తారక్‌, కల్యాణ్‌ రామ్‌

Wednesday, October 30, 2024

టాలీవుడ్ దగ్గర నందమూరి తారక రామారావు అనే పేరుకి ఓ ప్రత్యేక స్థానమే ఉంటుందని చెప్పాలి. దివంగత నటుడు స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ వారసత్వంలో తన పేరిట వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో ఓ సంచలనంగా మారాడు. అయితే ఇపుడు అదే నందమూరి కుటుంబానికి చెందిన నాలుగో తరం యువ నటుడే యంగ్ నందమూరి తారక రామారావు.

మరి దివంగత హరికృష్ణ గారి తనయుడు దివంగత జానకిరామ్ వారసుడిగా వచ్చిన ఈ నవ ఎన్టీఆర్ కి తన బాబాయిలు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ లు తమ బెస్ట్ విషెస్ ని అందించి నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లుగా ఇద్దరు సోదరులు తమ ఆశీస్సులు అయితే అందజేశారు.

ఇక ఈ యంగ్ ఎన్టీఆర్ ని దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండగా తనపై సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా వచ్చాయి. మరి ఈ యువ హీరో డెబ్యూ ఏ లెవెల్లో ఉంటుందో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles