ఆ ఎపిసోడ్‌ అదిరింది అంతే!

Thursday, October 24, 2024

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 ది రూల్” కోసమే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా పై  మూవీ మేకర్స్ ఓ భారీ ప్రెస్ మీట్ ని నేషనల్ మీడియాతో పెట్టి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయారు.

అనుకున్నట్లుగానే సినిమా విడుదల తేదిని ఒక రోజు ముందుకు జరిపి ఈ డిసెంబర్ 5 డేట్ ని ప్రకటించారు. అయితే ఈ సినిమా మేకర్స్ ఈ ప్రెస్ మీట్ లోనే పుష్ప 2 లోని ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం భారీ హైప్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఎప్పుడు నుంచో ఎక్కువగా వినిపిస్తున్న జాతర సీక్వెన్స్  గురించి తెలిసిందే. అదే ఈ సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ హైలైట్ అంటూ కొనియాడారు. అలాగే ఈ ఎపిసోడ్ తమ సినిమాలో మాస్టర్ పీస్ అంటూ నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. మరి ఇంతలా హైప్ ఇస్తున్న ఈ మ్యాడ్ సీక్వెన్స్ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles