ఎన్బీకే 109 విడుదల ఎప్పుడం

Tuesday, April 1, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబోలో చేస్తున్న భారీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో ఈ సినిమా 109వ సినిమాగా తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమా గురించి నందమూరి ఫ్యాన్స్ లో మాస్ హైప్ నెలకొంది. అయితే ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్‌  ఈ ఏడాదిలోనే లేదా సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారని బాలయ్య కొంతకాలం క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు బాలయ్య 109 విడుదలకి  ఫిక్స్ చేసిన తేదీ అంటూ ఒక తేదీ వైరల్ గా మారింది. బాలయ్య 109 ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి తీసుకురానున్నారంట. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది అని సమాచారం. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం జనవరి 9 అయితే బాగుంటుందేమో అనే భావనలో ఉన్నారు.

మరి ఈ మోస్ట్‌ అవైటెడ్ చిత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో ఒక అఫీషియల్ క్లారిటీ  రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles