కంగువా అందుకే ఆలస్యం!

Andhrawatch
1 Min Read

తమిళ్ నుంచి ఉన్న హీరోల్లో  తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలు కొందరు ఉన్నారు. అలాంటి హీరోల్లో వెర్సటైల్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో చేస్తున్న సెన్సేషనల్ సినిమా “కంగువా” విడుదలకి సిద్దంగా ఉంది.

అయితే ఈ సినిమాని మొదటిగా దసరా బరిలో అక్టోబర్ 10న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్ చేశారు.  కానీ ఈ డేట్ ని వాయిదా వేసినట్టు సూర్య ప్రకటించాడు. అయితే కొత్త డేట్ పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడంలేదు. అయితే దీనికి కారణం ఏంటో తెలుస్తుంది.

మేకర్స్ పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో కలిపి ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారట. ఒక భాషలో ఒకసారి మరో భాషలో ఒకసారి కాకుండా మొత్తం పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని సమాచారం. ప్రస్తుతం అయితే నవంబర్ మధ్యలో విడుదల అంటూ రూమర్స్ వినపడుతున్నాయి. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే.

Share This Article