భారీ సినిమాని సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్‌!

Andhrawatch
1 Min Read

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా నుంచి విడుదల కాబోతున్న తాజా చిత్రాల్లో కన్నడలో ఎప్పుడు నుంచో భారీ హైప్ ని సొంతం చేసుకున్న క్రేజీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “మార్టిన్” కూడా ఒకటి. ధృవ సార్జా హీరోగా దర్శకుడు ఏపీ అర్జున్ తెరకెక్కించగా ఈ సినిమాని పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేశారు.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.  ఇప్పుడు తెలుగులో ఎవరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అనేది రివీల్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టుగా ఇప్పుడు అప్డేట్ అందించారు.

మరి తెలుగు ఆడియెన్స్ లో మంచి యాక్షన్ సినిమాలకి కూడా మంచి క్రేజ్ ఉంది ఇక ఈ  సినిమా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

Share This Article