రజినీ సినిమాలో నాగ్‌..విశేషం ఏంటో తెలుసా!

Thursday, September 19, 2024

ప్రస్తుతం కోలీవుడ్ బాక్సాఫీస్‌ దగ్గర భారీ అంచనాలు క్రియేట్‌ చేసుకున్న సినిమాల్లో  సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే టాలెంటెడ్ డైరెక్టర్‌  లోకేష్ కనగరాజ్ లా కాంబోలో వస్తున్న భారీ సినిమా “కూలీ” కూడా ఒకటి. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి కూడా మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ మార్క్ క్యాస్టింగ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది.

కోలీవుడ్ నుంచి తలైవర్ మొన్ననే మళయాళ సినిమా నుంచి టాలెంటెడ్ నటుడు సౌబిన్ సాహిర్ ను దయాల్ అంటూ పరిచయం చేయగా నిన్ననే కింగ్ నాగార్జున ని సైమన్ అంటూ పరిచయం చేశారు. దీంతో ఒక్కసారిగా కూలీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే సినిమా ప్రకటించిన సమయంలో ‘డిస్కో’ అనే పదాన్ని బాగా హైలైట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ పదానికి సంబంధించే ఒకో అక్షరం తాలూకా పాత్రదారుణ్ని మూవీలో పరిచయం చేస్తున్నారు. గతంలో లియో తరహాలో ఒక థియరీ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇలా డిస్కో లో ఎస్ తో మొదలయ్యే సైమన్, డి తో మొదలయ్యే దయాల్ లు అభిమానుల ముందుకు వచ్చారు.  ఇంకో ముగ్గురు పరిచయం కావాల్సి ఉందని అంటున్నారు. మరి నిజంగానే క్యాస్టింగ్ ఇలా జరుగుతుందా లేదా అనేది మరో అప్డేట్ వస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పుకొవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles