ఈసారి అంతకు మించి

Friday, December 20, 2024

జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ  నుంచి హీరోగా పరిచయం అయిన టాలెంటెడ్ నటుడు శ్రీ సింహ హీరోగా పరిచయం అయిన సాలిడ్ ఫన్ థ్రిల్లర్ మూవీ “మత్తు వదలరా” సినిమా గురించి మన తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా వచ్చిన ఒక షాకింగ్ హిట్ గా నిలిచి అదరి అభిమానాలు, ప్రశంసలు అందుకుంది.. దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ సినిమాకి సీక్వెల్ “మత్తు వదలరా 2” ని ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ సాలిడ్ టీజర్ ని విడుదల చేసారు. మరి ఈ టీజర్ దానికి డబుల్ డోస్ ట్రీట్ ని ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఈసారి పాత కథకి కొనసాగింపుగా మరో కోణంతో తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో సత్య, వెన్నెల కిషోర్ లపై ఫన్ ఎలిమెంట్స్ అయితే వేరే లెవల్‌ అని చెప్పుకొవచ్చు. రీసెంట్ గా జరిగిన కొన్ని కాంట్రవర్సీలు వాటిపై సెటైర్స్ ఈ టీజర్ కట్ లో సూపర్‌ ఉన్నాయి.

అలాగే శ్రీ సింహా కూడా మంచి లుక్స్ పర్ఫెక్ట్ టైమింగ్ తో కనిపిస్తున్నాడు. ఇంకా నటి ఫరియా అబ్దుల్లా యాక్షన్ తో అదరగొట్టింది అని చెప్పుకొవచ్చు. ఇంకా లాస్ట్ లో  విజువల్స్ ద్వారా ఒక్కసారిగా మరింత ఫన్ ని పేల్చారని చెప్పాలి. ఇక కాల భైరవ మరోసారి తన సౌండ్ తో ఇంకా ఇంట్రెస్టింగ్ స్కోర్ తో అదరగొట్టేసాడు. ఇలా మైత్రి మూవీ మేకర్స్ మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో  వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles