భారీ యాక్షన్‌ సీన్లతో వీరమల్లు!

Wednesday, September 18, 2024

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న భారీ పీరియాడిక్‌ సినిమా “హరి హర వీరమల్లు” కోసం తెలిసిందే. పవన్ కెరీర్ లో అనౌన్స్ అయిన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కాగా ఈ సినిమా పైభారీ హైప్ నెలకొంది. కానీ ఈ చిత్రం అలా ఆలస్యం అవుతూండడం మాత్రం అభిమానులని తీవ్ర నిరాశకు గురి చేసింది.

దాదాపు నాలుగేళ్లు అయిపోయినప్పటికీ ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఈ చిత్రం మళ్ళీ చాలా కాలం విరామం తర్వాత షూటింగ్ ని పునః ప్రారంభం చేసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుండగా ఆల్రెడీ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఇతర సన్నివేశాలు ప్రారంభం అయినట్లు టాక్‌.

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ స్లివ ఈ సీక్వెన్స్ ని రూపొందిస్తుండగా మొత్తం 400 నుంచి 500 మందితో ఈ సీన్ ని ప్లాన్ చేశారట. ఇలా మొత్తానికి అయితే మళ్ళీ వీరమల్లు షూట్ తిరిగి మొదలవ్వబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles