వాట్…కల్కిని దాటేసిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సినిమా!

Sunday, December 22, 2024

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌ గా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ లోను వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది కల్కి. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఓ హీరోయిన్ త‌న మూవీతో షాక్ ఇవ్వ‌టం ట్రేడ్ వ‌ర్గాల‌ను సైతం షాక్‌ కి గురిచేస్తోంది.

ప్ర‌భాస్‌తో సాహూ సినిమాలో క‌లిసి న‌టించిన శ్ర‌ద్ధాకపూర్‌ ప్ర‌ధాన పాత్ర‌లో ‘స్త్రీ2’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ  సినిమా ఆగ‌స్ట్ 15న విడుదల అవుతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు అందరిని ఆశ్ఛర్యపరుస్తున్నాయి. శ్రద్దా నటించిన స్త్రీ2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ కల్కి, ఫైటర్ సినిమాల‌ను దాటేసి  దూసుకువెళుతు బాలీవుడ్ వ‌ర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఫైట‌ర్‌, క‌ల్కి సినిమాలను దాటేసి స్త్రీ2 ఏకంగా రూ.20 కోట్లు మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను వసూలు చేసింది.

హిట్ టాక్ వస్తే లాంగ్ వీకెండ్ కారణంగా ఇండియన్  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రిన్ని రికార్డులను  ఈ సినిమా సృష్టించడం ప‌క్కా అని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఆగ‌స్ట్ 15న స్టార్ హీరోలు న‌టించిన రెండు సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ 2 అడ్వాన్స్ బుకింగ్స్  విషయంలో దూసుకుపోతుంది. 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా ఆరుసంవత్సరాలకు స్త్రీ 2ను తెర‌కెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ లభించింది.

ముఖ్యంగా త‌మ‌న్నా ఐటెమ్ సాంగ్‌ నెట్టింటి హల్ చల్ చేసింది.స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టి ఒక హీరోయన్ నటించిన సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles