ఎన్బీకే 109…ఆయన ముగించేశాడుగా..!

Thursday, September 19, 2024

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన కెరీర్‌లోని 109వ చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ను ఇంతకు ముందే మూవీ మేకర్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దానికి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో అప్డేట్‌ను దర్శకుడు బాబీ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది.

అయితే, ఈ సినిమాలోని బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ తాజాగా ముగిసినట్లుగా దర్శకుడు బాబీ తెలియజేశాడు. బాబీ డియోల్‌తో కలిసి ఉన్న ఫోటోను దర్శకుడు బాబీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నాడు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles