శ్రీలీల గురించి ఆ మాటలను నమ్మోద్దంటున్న డైరెక్టర్‌!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్ యంగ్ సెన్సెషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఆమె తన అందం, నటనతో అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.  అయితే శ్రీలీలకు  రీసెంట్ గా ఓ బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్‌ చేసినట్లు వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నిర్మాత రమేశ్‌ స్పందించారు. ఈ మేరకు నిర్మాత క్లారిటీ ఇస్తూ.. అది పూర్తిగా అబద్దమని, అసలు సినిమాలో సెకండ్ హీరోయిన్‌ పాత్ర  కోసం ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌ ని కూడా సంప్రదించలేదని తెలిపారు. అసలు మేటరేంటంటే…బాలీవుడ్‌ హీరో వరుణ్‌ధావన్‌ ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా దీనిపై ఆ చిత్ర నిర్మాత రమేశ్‌ స్పందించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వరలోనే ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. కథానాయికగా ఎవరిని ఎంపిక చేశామనే విషయాన్ని అతిత్వరలోనే ప్రకటిస్తాం. అప్పటివరకు ఎలాంటి వార్తలను నమ్మకండి” అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Share This Article