కన్నడ స్టార్ హీరో యష్ తన భారీ చిత్రాలు “కేజీయఫ్” తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి భారీ సినిమాల తర్వాత వాటికి మ్యాచ్ అయ్యే విధంగా ఎలాంటి సినిమా చేస్తాడు అని అందరు అనుకుంటున్న సమయంలో యష్ ప్రకటించిన మరో భారీ చిత్రమే “టాక్సిక్”.
లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో ఈ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ మధ్య మొదలయ్యింది కానీ ఈ సినిమాకి యష్ లుక్ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు బయటకి రాలేదు. కానీ ఇప్పుడు యష్ సరికొత్త మేకోవర్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బయట యష్ కనిపించగా ప్రేక్షకులు తన కొత్త లుక్స్ ని అభిమానులు క్లిక్ మనిపించారు.
దీంతో సోషల్ మీడియాలో తన కొత్త లుక్ వైరల్ గా మారింది. మరి అదే గడ్డంలో కాకపోతే ఈసారి కొత్త హెయిర్ స్టైల్ ని యష్ డిజైన్ చేయించుకున్నాడు. మరి ఇందులో తాను సూపర్ స్టైలిష్ గా కనిపిస్తుండగా టాక్సిక్ కి ఇదే లుక్ అంటూ ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు.