పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో యంగ్‌ హీరోయిన్‌!

Andhrawatch
1 Min Read

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు.. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ నుంచి అపర్ణాదాస్‌ వంటి చాలా మంది నటీమణులు తమ స్నేహితులు, ప్రేమికులను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇక త్వరలోనే ఈ లిస్ట్‌ లోకి అదితి రావు, తమన్నా కూడా చేరబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మేఘా ఆకాష్‌ పేరు కూడా  తెర మీదకు  వచ్చింది. ఎందుకంటే  హఠాత్తుగా ఆమె సాంప్రదాయ పద్ధతిలో చీర ధరించి, మెహందీతో తన చేతులను అలంకరించుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త పెళ్లి కూతురిలా కనిపిస్తోంది. అంతేకాకుండా  ఆమె షేర్ చేసిన ఫొటోకి #weddingvibes అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించింది. దీంతో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని కొందరు ప్రచారం మొదలు పెట్టేశారు.

అయితే అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే ఈ ఫొటోలు ఆమె వివాహానికి సంబంధించినవి కాదు. ఆమె నటించిన యాడ్‌ షూట్‌ పిక్స్‌ అని తెలుస్తుంది. ఆమె పెళ్ళికి రెడీ అవుతున్న మాట నిజమే కానీ ఈ ఫోటోలు ఆమె వివాహ వేడుకకి సంబంధించినవి మాత్రం కాదని తెలుస్తోంది. 

Share This Article