35-చిన్న కథకాదు విడుదల తేదీలో మార్పు!

Sunday, December 22, 2024

టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ నటిస్తున్న తాజా సినిమా ‘35 – చిన్న కథ కాదు’ పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లతో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పిస్తుండటంతో సినీ సర్కిల్స్‌లోనూ ఈ సినిమా పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది.  అయితే, ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ, ఇప్పుడు 35 – చిన్న కథ కాదు విడుదల తేదీని మార్చినట్లుగా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 15న బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు క్లాష్ అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సినిమా రిలీజ్ తేదీ మార్పునకు సంబంధించి తాజాగా ఓ వీడియో రూపంలో అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియోలో ‘‘టీచర్ చెప్తే వినాలి.. రిలీజ్ తేది మారాలి..’’ అంటూ ఓ లైన్‌ను మూవీ  మేకర్స్ జోడించారు.

దీన్నిబట్టి చూస్తే, ఈ 35 – చిన్న కథ కాదు మూవీని టీచర్స్ డే రోజైన సెప్టెంబర్ 5న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైనట్లు కనబడుతుంది. ఇక ఈ సినిమాలో విశ్వ, ప్రియదర్శి, గౌతమి ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నందకిషోర్ ఈమని డైరెక్ట్ చేయగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles