సల్మాన్‌ పందిలా తింటాడు..కుక్కలా..నటుడి సంచలన వ్యాఖ్యలు

Wednesday, January 22, 2025
సల్మాన్‌ పందిలా తింటాడు..కుక్కలా..నటుడి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. కండలు తిరిగిన శరీరంతో హ్యాండ్సమ్ లుక్స్‌ తో ఆరు పదుల వయసు వచ్చిన అమ్మాయిల కలల రాకుమారుడనే చెప్పవచ్చు. అయితే సల్మాన్‌ గురించి ఆయన సన్నిహితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను ఎవరో కాదు విందు దారా సింగ్‌.

వీరిద్దరికీ చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహం ఉంది. విందు దారా సింగ్‌ అప్పట్లోనే ఫిట్‌ బాడీని మెయింటెన్‌ చేసేవారు. ఈ క్రమంలో సల్మాన్‌ కూడా జిమ్‌ బాడీ కోసం ప్రయత్నించేవారు. అందుకోసం ఆయన గంటల కొద్ది జిమ్ లో వర్కౌట్లు చేసేవారని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దారా సింగ్‌ తెలిపారు.

సల్మాన్‌ తిండి విషయంలో కానీ , జిమ్ విషయంలో కానీ అసలు మోహమటపడేవాడు కాదని దారా సింగ్‌ చెప్పుకొచ్చాడు. ” ఇద్దరం కలిసి కాలేజీ రోజుల్లో చదువుకునేవారం. నేను చదువుతో పాటు బాడీ మీద కూడా చాలా ఫోకస్ పెట్టేవాడిని . మంచి బాడీ షేప్‌ కోసం బాగా కష్టపడేవాడిని. నేను అనుకున్నట్లుగానే అతి కొద్ది రోజుల్లోనే నేను ఫిట్‌నెస్‌ సాధించాను. నా బాడీని చూసి సల్మాన్‌ కూడా బాడీ షేప్‌ మీద ఆసక్తి పెంచుకున్నాడు.

దీంతో నాకంటే ఎక్కువ సేపు జిమ్‌ లోనే ఉండేవాడు. పందిలాగా తినడం…కుక్కలాగా జిమ్‌ చేయడమే సల్మాన్‌ పని అయిపోయింది. సల్మాన్‌ తీరు చూసి చాలా ఓవర్‌ చేస్తున్నాడు అనుకునేవాణ్ణి. అతను తినే తిండి చూసి భాయ్‌ ఆ తిండి అంతా ఎక్కడికి పోతుంది అని అడిగితే సాయంత్రం జిమ్‌ లో కాలిపోతుందని చెప్పేవాడు అంటూ దారా సింగ్‌ చెప్పుకొచ్చారు.

సల్మాన్‌ వంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే ఎదురెళ్లి మరీ సాయం చేసి వస్తాడని దారా సింగ్‌ సల్మాన్‌ గురించి చెప్పుకొచ్చాడు. సల్మాన్‌ కు తన తండ్రి సలీం ఖాన్‌ ప్రతి రోజూ కొంత పాకెట్‌ మనీ ఇచ్చేవారు. దానిని అంతటిని కూడా తన అసిస్టెంట్‌ నదీమ్‌ కు ఇచ్చేసేవాడు. సల్మాన్‌ తన తండ్రి ఇచ్చే డబ్బులో చాలా వరకు పేదవారి కోసమే ఖర్చు పెట్టేవాడు.

అదే అలవాటు ఆయనకు ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ నెలకు రూ. 25 నుంచి 30 లక్షల డబ్బును దానంగా ఇస్తారని దారా సింగ్‌ చెప్పుకొచ్చారు. అందుకే సల్మాన్ అంటే అంత ఇష్టమని దారా సింగ్‌ చెప్పుకొచ్చారు. సల్మాన్‌ లాంటి వ్యక్తి నా మిత్రుడు అని చెప్పుకొవడానికి నేను ఎంతో గర్వపడుతున్నానని దారా సింగ్‌ అన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles