హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే ప్రక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండంటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమెషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 21న విడుదల చేయనున్నట్లు ముందు మేకర్స్ ప్రకటించారు.
కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ ట్రైలర్ విడుదల వాయిదా పడింది. ఇదే విషయాన్ని మరో ప్రమోషనల్ వీడియో ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 23న జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వివరించింది. ఇక ఈ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ కూడా వస్తుండటంతో అందరి చూపులు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పైనే ఉన్నాయి.
ఈ సినిమాలో నితిన్ పక్కన అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, దేవ్‌దత్తా నాగె ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.