రెబల్‌ స్టార్‌ పక్కన సీతామహాలక్ష్మి

Wednesday, February 19, 2025
సీతారామం సినిమాతో కుర్రాళ్ల మనుసులు దోచుకున్న మృణాలు ఆచితూచి ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది. సీతారామంతో తరువాత నాని సరసన హాయ్‌ నాన్న సినిమాతో మరో హిట్‌ ని తన ఖాతాలో వేసుకుంది. తొలి సినిమాతోనే భారీ విజయానని సొంతం చేసుకుంది. త్వరలో విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నట్లు సమాచారం.

ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే మృణాల్ టాలీవుడ్‌ లో మరో బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా ఎవరి పక్కనో తెలుసా.. ప్రభాస్‌ పక్కన. ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి సినిమా, మారుతీ డైరెక్షన్‌ రాజా సాబ్ అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఎందుకంటే సలార్ తరువాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న సినిమాలు. ఈ రెండు సినిమాలు తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్‌ ఒప్పుకున్నట్లు సమాచారం.  ఈ సినిమాలో మృణాల్‌ కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles