పుష్ప 2 సినిమాలో జాన్వీ కపూర్‌..ఏ పాత్రలో నటిస్తుందంటే

Wednesday, January 22, 2025
పుష్ప 2 సినిమాలో జాన్వీ కపూర్‌..ఏ పాత్రలో నటిస్తుందంటే!

పుష్ప సినిమా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో.. ఎన్ని అవార్డులను గెలుచుకుందో తెలిసిన విషయమే. అల్లు అర్జున్‌ ని జాతీయ నటుడిగా ప్రపంచం ముందు నిలబెట్టిన సినిమా పుష్ప . ఆ సినిమాలో ఊ అంటావా మావా..ఊఊ అంటావా మావా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యావత్‌ భారత్‌ ని ఓ ఊపు ఊపిని పాట. అందులో సమంత చేసిన స్టెప్పులు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతాయి. సుకుమార్‌- అల్లు అర్జున్‌ మాస్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా వచ్చిన పుష్ప సినిమా కి పొడిగింపు పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని అటు బన్నీ ఫ్యాన్స్‌ పిచ్చగా వెయిట్‌ చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా పుష్ప 2 సినిమా లో కూడా ఓస్పెషల్‌ సాంగ్‌ ని పెట్టేందుకు చిత్ర బృందం రంగం సిద్దం చేసింది. అయితే ముందుగా ఈ సాంగ్‌ లో మళ్లీ సమంతనే తీసుకుందాం అనుకున్నారు. కానీ చిత్ర బృందం తమ నిర్ణయం మార్చుకుని ఎంతో మంది నటీమణులను పరిశీలించిన తరువాత ఆ పాటకు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ గా డిసైడయ్యింది. ఇప్పటికే ఈ సాంగ్‌ విషయం గురించి చిత్రం బృందం, సుకుమార్‌ జాన్వీతో మాట్లాడినట్లు సమాచారం.

ఇందులో ఆడిపాడేందుకు ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. పుష్ప లో ఐటమ్‌ సాంగ్‌ ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 లో జాన్వీ ఆడిపాడితే ఆ సాంగ్‌ కూడా రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది.

ప్రస్తుతం జాన్వీ తారక్‌ , కొరటాల శివ కాంబినేషన్‌ లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి జాన్వీకి సంబంధించిన కొన్ని లుక్స్‌ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే జాన్వీ రామ్‌ చరణ్‌ – సాన బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఆర్‌సీ 16 సినిమాలో కూడా నటిస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్‌ తెలిపారు. ఇప్పటి వరకు జాన్వీ నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాకపోయినప్పటికీ ఆమె కోసం మాత్రం అవకాశాలు వరుస కడుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles