నాకు ఈ మధ్య ఆ పిచ్చి ఎక్కువ అయ్యింది: మెగా డాటర్‌ నిహారిక

Monday, December 23, 2024

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా కుటుంబం నుంచి మొట్టమొదట కథానాయికగా వచ్చిన్నప్పటికీ ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. దీంతో చేసేదేమి లేక పెళ్లి చేసుకుంది. అది కూడా మూణాళ్ల ముచ్చటగానే మిగిలింది. పెళ్లైన మూడు సంవత్సరాలకే విడాకులు ఇచ్చేసింది.

ఆ తరువాత కొంత కాలం ఆమె తన స్నేహితులతో కలిసి రిఫ్రెష్‌ అవ్వడానికి విదేశాలకు చెక్కేసింది. మళ్లీ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు నిహారిక సిద్దమైనట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నిర్మాతగా ఓ మూవీని స్టార్ట్‌ చేసింది. త్వరలోనే నటిగా కూడా రాబోతున్నట్లు తెలిపింది. తాజాగా నిహారిక  ఆహా యాప్‌ లో ఓ కార్యక్రమానికి యాంకర్‌ గా మారిపోయింది.

చెఫ్‌ మంత్ర సీజన్‌ 3 కి అన్ని తానై చూసుకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ షో మొదటి ఎపిసోడ్‌ కూడా స్ట్రీమింగ్‌ అయ్యింది. అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఈ మధ్య కాలంలో నాకు తిండి పిచ్చి ఎక్కువ అయ్యింది. అందులోనూ ముఖ్యంగా పప్పు చారు కనిపిస్తే అసలు విడిచిపెట్టడం లేదు. దాంతో పాటు ప్రయాణాలంటే మరీ ఇష్టం పెరిగిపోయింది. అందుకే సడెన్‌ గా ఎక్కడికి వెళ్లాలి అనిపిస్తే అక్కడికి వెళ్లిపోతున్నాను.ఆ ప్రయాణాలకు అయ్యే ఖర్చు అంతటిని కూడా నేనే కష్టపడి దాచుకుంటున్నాను. నాకు కమర్షియల్‌ సినిమాల్లో యాక్ట్‌ చేయాలని ఉంది.

కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌ కూడా అలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లో అలాంటి పాత్రలు వస్తే మాత్రం కచ్చితంగా చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక చెఫ్‌ మంత్ర షో గురించి చెప్పుకొచ్చింది. ఆ షో కి నాన్నమ్మను, సురేఖ అమ్మను, ఉపాసన వదినను తీసుకురావాలని ఉందని వివరించింది.

నాకు ఆడిషన్స్‌ కు వెళ్లడం అంటే చాలా ఇష్టమని కూడా వివరించింది. కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌ కూడా నన్ను ఆడిషన్‌ చేయలేదు. ఎందుకంటే నేను పెద్ద కుటుంబం నుంచి రావడమే దానికి కారణం. కానీ ఎవరైనా ఆడిషన్ కి పిలిస్తే మాత్రం కచ్చితంగా ఆడిషన్‌ కి వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles