జ్యోతిష్యం పంచమ వేదం. అనాదిగా మానవుడు తన జననకాల గ్రహస్థితిని ఆధారం చేసుకొని, లగ్న చక్రం వేసి, ద్వాదశ రాశులలోని గ్రహగమనముల ఆధారముగా జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయే విషయాలను వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఈ శాస్త్రం, నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము.
మానవుడు తానూ జన్మించిన సమయము, నక్షత్రమును ఆధారము చేసుకుని, మేషాది లగాయతు మీన రాశుల మధ్యలో ఏదో ఒక రాశికి చెందినవాడై ఉంటాడు. మేషాది, మీన రాశులలో ఒక్కో రాశికి 9 పాదముల చొప్పున 108 పాదములు కలవు. ఒక రోజుకు 24 గంటలు. ఈ 24 గంటలను 12 రాశుల చొప్పున విభజించగా, 12 లగ్నములు ఏర్పడును. అనగా, ఒక లగ్న ప్రమాణం, 2 గంటలు.
మానవుని జీవితంలోని విషయాలను చెప్పడానికి, లగ్నం, మరియు నక్షత్ర పాదం ఆధారం. మనిషి జన్మించిన సమయము, నక్షత్రము ప్రకారం లగ్న చక్రం వేసి చూడగా, ఆ సమయమునకు మేషాది మీన రాశుల మధ్య ఉన్న గ్రహ పరిభ్రమణ స్థితి ఆధారముగా, ఒక మనిషి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయే విషయాలకు సంబంధించి, ఏదైనా దోషము ఉన్నట్లయితే, జ్యోతిశాస్త్రవేత్తలు సూచించిన అనేక నివారణ మార్గాలలో, తీర్థస్థలిని దర్శించుట, మంత్రపఠనం చేయడం ఒక మార్గం