టిల్లు ప్రేమాయణం నడిపేది ఆ స్టార్‌ హీరోయిన్‌ తోనా

ANDHRAWATCH
1 Min Read

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ అందరూ కూడా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా యువ హీరో కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాటలోనే ఇప్పుడు డీజే టిల్లు… సిద్దు జొన్నలగడ్డ కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి స్వయంగా టిల్లు తమ్ముడే వెల్లడించాడు.

బబుల్ గం సినిమాతో టిల్లు సోదరుడు చైతు జొన్నలగడ్డ మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.  ఈ క్రమంలో యాంకర్‌ సిద్దు జొన్నలగడ్డ గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలలోనే సిద్దు పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది.

సిద్దు చాలా కాలం నుంచి ఓ స్టార్‌ హీరోయిన్‌ తో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. అది నిజమేనా అని ప్రశ్నించారు. అంతేకాకుండా వచ్చే ఏడాదే ఆ హీరోయిన్‌ తో వివాహం కూడా జరగనున్నట్లు సమాచారం వస్తుందని, ఆమె ఎవరూ అంటూ యాంకర్‌ పలు ప్రశ్నలు సంధించాడు. దానికి చైతూ నవ్వుతూ.. స్టార్‌ హీరోయిన్‌ ని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ… స్టార్‌ హీరోను చేసుకుంటేనే ప్లాబ్లం అంటూ నవ్వేశాడు.

అయితే స్టార్‌ హీరోయిన్‌ నే చేసుకుంటాడో లేదో అంతగా తెలియదు కానీ.. వచ్చే ఏడాది మాత్రం అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే ఉందని చైతూ తెలిపాడు. సమయానికి అన్ని కుదిరితే జరిగిపోవచ్చని చైతూ వివరించాడు.

- Advertisement -
Share This Article