చుట్టమల్లే’ సాంగ్: 33 మిలియన్ల వ్యూస్ తో టాప్ ట్రెండ్ గా మారింది

Friday, December 5, 2025

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “దేవర” సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మరియు సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన పొందగా, మేకర్స్ తాజాగా “చుట్టమల్లే” అనే సెకండ్ సింగిల్ పాటను విడుదల చేశారు.

ఈ రొమాంటిక్ ట్రాక్ అభిమానులను చాలా మెప్పిస్తోంది. యూట్యూబ్‌లో 33 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి, టాప్ ట్రెండ్‌గా నిలిచింది. ఇది నిజంగా సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు. శిల్పా రావు వోకల్స్ ఆడియెన్స్‌ను మాయ చేస్తుండగా, రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ కంపోజ్ చేసిన ఈ పాటను వెండితెరపై చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు మరియు అభిమానుల మధ్య భారీ అంచనాలు ఏర్పడింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles