ఆస్కార్‌ వేదిక మీదకి నగ్నంగా వచ్చిన స్టార్‌ రెజ్లర్‌!

Sunday, December 22, 2024
ప్రపంచ సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు.. ఆస్కార్‌ అవార్డులు. గతేడాది తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా. నాటు నాటు పాటకు కీరవాణి , చంద్రబోస్‌ లకు ఆస్కార్ రావడంతో ప్రపంచ సినిమా మొత్తం తెలుగు చిత్ర సీమ వైపు చూసింది.

అయితే ఆస్కార్‌ వేదిక పై ఎప్పుడూ ఏదోక వివాదం తెర మీదకు వస్తూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా ఓ సంఘటన అభిమానులకు షాక్‌ గురి చేసింది. ఎందుకంటే స్టార్‌ రెజ్లర్‌ జాన్‌ సీనా ఆస్కార్‌ వేదిక మీదకు నగ్నంగా వచ్చి అందర్ని ఒక్కసారిగా షాక్‌ కు గురి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఏడాది ఆస్కార్‌ వేడుకల్లో బెస్ట్‌ కాస్ట్యూమ్‌ అవార్డును ఇచ్చేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ జాన్‌ సీనాకు వచ్చింది. ఈ అవార్డును ఇచ్చేందుకు యాంకర్స్‌ ఆయన పేరును పిలిచారు. అక్కడి వరకు బాగానే ఉంది. తరువాత జాన్ సీనా స్టేజ్‌ మీదకు వచ్చాడు. అయితే ఆయన వచ్చిన తరువాత అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

ఆ తరువాత అక్కడ ఉన్నవారంతా తెగ నవ్వుకున్నారు. ఎందుకంటే జాన్‌ సీనా స్టేజీ మీదకి నగ్నంగా వచ్చాడు. అవార్డు విన్నర్‌ పేరు ఉన్న కార్డును తన ప్రైవేట్ పార్ట్‌ కనిపించకుండా అడ్డుగా పెట్టుకుని వచ్చాడు. అంతేకాకుండా సినిమాల్లో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఎంత ముఖ్యమో ఇప్పుడే తెలిసి వచ్చింది అంటూ అందర్ని నవ్వించాడు.

ఆ తరువాత మరోకరు వచ్చి ఈ అవార్డు నామినీల జాబితాను వివరించాడు. ఈ అవార్డు కోసం ఈ సారి పోటీ పడిన వారిలో బార్బీ, కిల్లర్స్‌ ఆఫ్‌ ప్లవర్‌ మూన్‌, నెపోలియన్‌, ఓపెన్ హైమర్‌ , పూర్‌ థింగ్స్ నిలిచాయి. నామినీల వీడియోను బిగ్‌ స్కీన్‌ పై వస్తుండగానే జాన్‌ సీనా స్టేజ్‌ పైనే బట్టలు వేసుకున్నాడు. ఆ సమయంలో స్టేజ్ మీద లైట్లన్నీ ఆపేశారు.

ఆ సమయంలో ఓ ఐదుగురు మనుషులు వేగంగా సీనాకు వచ్చి డ్రెస్‌ వేసి వెళ్లిపోయారు. ఆ తరువాత సీనా విజేతను అనౌన్స్‌ చేశాడు. ఆ అవార్డ్‌ పూర్‌ థింగ్స్‌ సినిమాకు వచ్చింది. కొన్ని కోట్ల మంది ఈ వేడుకలను చూస్తుంటారు.. అలాంటి వేదిక మీద ఓ స్టార్‌ రెజ్లర్‌ ఇలా నగ్నంగా రావడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫ్యాన్స్‌ కూడా అతడేంటి ఇలా చేశాడంటూ చర్చించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles